మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్‌  | AlphaGrep Mutual Fund files offer document for Multi asset Allocation Fund | Sakshi
Sakshi News home page

మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్‌ 

Jun 8 2026 3:45 AM | Updated on Jun 8 2026 3:45 AM

AlphaGrep Mutual Fund files offer document for Multi asset Allocation Fund

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సేవల్లోకి ఆల్ఫాగ్రెప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ అడుగు పెట్టనుంది. తన మొదటి పథకం ‘మల్టీ అసెట్‌ అలోకేషన్‌ ఫండ్‌’ను వచ్చే నెల 6న ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మొదటి మూడు నుంచి ఐదేళ్ల కాలంలోనే రూ.25,000–30,000 కోట్ల నిర్వహణ ఆస్తులను (ఏయూఎం) చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ సీఈవో భౌతిక్‌ అంబానీ తెలిపారు. 

అత్యాధునిక గణన నమూనాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లరి్నంగ్‌ ఆధారిత క్వాంటిటేటివ్‌ ఈక్విటీ, హైబ్రిడ్‌ వ్యూహాలతో సేవలు అందించనున్నట్టు చెప్పారు. భిన్నమైన పెట్టుబడులు, సేవలతో కూడిన ఉత్పత్తులను ఇన్వెస్టర్లకు అందించనున్నట్టు తెలిపారు. మల్టీ అసెట్‌ అలోకేషన్‌ అనంతరం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement