భారత్‌లో స్టార్‌లింక్‌.. ఎలాన్‌ మస్క్‌తో ఎయిర్‌టెల్ డీల్‌ | Airtel tied up with Elon Musk Starlink to provide internet in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్టార్‌లింక్‌.. ఎలాన్‌ మస్క్‌తో ఎయిర్‌టెల్ డీల్‌

Mar 11 2025 5:48 PM | Updated on Mar 11 2025 6:36 PM

Airtel tied up with Elon Musk Starlink to provide internet in India

ఢిల్లీ : ప్ర‌ముఖ టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ శుభ‌వార్త చెప్పింది. త‌న వినియోగ‌దారుల‌కు హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల్ని భారత్‌లో ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. 

ఈ సంద‌ర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్, వైస్ ఛైర్మ‌న్ గోపాల్ మిట్ట‌ల్  మాట్లాడుతూ.. భార‌త్‌లో ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో ప‌నిచేయ‌డం ఓ మైలురాయి. ముఖ్యంగా క‌స్ట‌మ‌ర్ల‌కు శాటిలైట్ ఇంట‌ర్నెట్‌ను అందించేందుకు సంస్థ క‌ట్టుబ‌డి ఉంది.  

ఎయిర్‌టెల్,  స్పేస్‌ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్‌టెల్  రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని పొందేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఎక్విప్‌మెంట్ పొంద‌వ‌చ్చు. దీంతో పాటు భార‌త్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉప‌యోగ‌ప‌డనుంద‌ని తెలిపారు.  

ఎలాన్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే ల‌క్ష్యంతో ప‌నిచేస్తోంది. త‌ద్వారా యూజ‌ర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్‌లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్య‌క‌లాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్‌టెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement