బంగ్లాదేశ్‌ ఉద్రిక్తతలతో అలర్ట్‌ అయిన భారత్‌ | Air India Cancels All Flights To And From Dhaka | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ ఉద్రిక్తతలతో అలర్ట్‌ అయిన భారత్‌

Aug 5 2024 6:31 PM | Updated on Aug 5 2024 7:31 PM

Air India Cancels All Flights To And From Dhaka

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌కు నడిపించే విమాన సర్వీసులను తక్షణం రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ఎయిర్‌ ఇండియా పోస్ట్ చేసింది. 

“బంగ్లాదేశ్‌లో తాజా పరిస్థితుల దృష్ట్యా, ఢాకాకు నడిచే మా విమానాలను తక్షణమే రద్దు చేశాం. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కన్‌ఫర్మ్‌ బుకింగ్‌ ఉన్న ప్రయాణికులకు రీషెడ్యూల్, క్యాన్సిలేషన్‌ ఛార్జీలపై వన్-టైమ్ మినహాయిం‍పు ఇస్తున్నాం'' అని పేర్కొంది.

 మరోవైపు.. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్.. తాజా పరిస్థితుల్ని వివరించినట్లు సమాచారం. ఇక సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు, చొరబాట్లు జరిగే అవకాశాలు ఉండడంతో సైన్యం అప్రమత్తమైంది. అలాగే బంగ్లాలో ఉన్న భారతీయుల కోసం అడ్వైజరీ విడుదల చేసింది. అయితే.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement