ఎయిర్‌ ఇండియా అదనపు సర్వీసులు | Air India To Add 24 New Domestic Flights | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా అదనపు సర్వీసులు

Aug 12 2022 8:37 AM | Updated on Aug 12 2022 9:10 AM

Air India To Add 24 New Domestic Flights - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా అదనంగా 24 సర్వీసులను దేశీయంగా జోడిస్తోంది. ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై, అలాగే ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌ మార్గాల్లో ఇవి జతకూడనున్నాయని కంపెనీ గురువారం ప్రకటించింది.

ఆగస్ట్‌ 20 నుంచి కొత్త సర్వీసులు తోడవనున్నాయి. విమానాల కోసం భాగస్వాములతో ఆరు నెలలుగా చర్చిస్తున్నామని ఎయిర్‌ ఇండియా ఎండీ, సీఈవో క్యాంబో విల్సన్‌ తెలిపారు. ఇవి ప్రస్తుతం ఫలిస్తున్నాయని చెప్పారు.    

Advertisement
 
Advertisement
Advertisement