
10.42 శాతం వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మర్)లో మిగిలిన 10.42 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తాజాగా పేర్కొంది. బీఎస్‌ఈ బ్లాక్‌డీల్ గణాంకాల ప్రకారం షేరుకి రూ. 275.5 ధరలో 13,54,82,400 షేర్లు అమ్మివేసింది. 11 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 3,733 కోట్లకు 10.42 శాతం వాటా విక్రయించింది.
వీటిలో ఢిల్లీ సంస్థ షాజాయిటన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎఫ్‌జెడ్‌సీవో 8.52 శాతం వాటాకు సమానమైన 11.07 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 3,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఏడబ్ల్యూఎల్ అగ్రిలో షేర్లు కొనుగోలు చేసిన ఇతర సంస్థలలో క్వాంట్ ఎంఎఫ్, ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్, బంధన్ ఎంఎఫ్‌తోపాటు.. జూపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్, మార్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ తదితరాలున్నాయి.