గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లకు అదానీ క్యాపిటల్‌ నిధులు

Adani Capital Starts Providing Working Capital To 1500 For Village Level Entrepreneurs - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ–స్టోర్స్‌ నిర్వహిస్తున్న 1,500 మంది గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లకు (వీఎల్‌ఈ) నిర్వహణ మూలధనాన్ని సమకూర్చనున్నట్లు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ అదానీ క్యాపిటల్‌ వెల్లడించింది. దీనికి సంబంధించి సీఎస్‌సీ ఈ–గవర్నె న్స్‌ సర్వీసెస్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం 10,000 మంది వీఎల్‌ఈలు సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ–స్టోర్స్‌లో నమోదు చేసు కున్నారు. ఎఫ్‌ఎంసీజీ, గృహోపకరణాలు, వాహనాలు మొదలైన వాటి తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరుగా పంపిణీ చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కేంద్ర ఎ లక్ట్రానిక్స్, ఐటీ శాఖ కింద స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌గా సీఎస్‌సీ ఏర్పాటైంది. ఇది 2020 ఏప్రిల్‌లో గ్రా మీణ్‌ ఈ–స్టోర్‌ను ప్రారంభించింది. అదానీ గ్రూప్‌నకు సీఎస్‌సీ గ్రామీణ్‌ ఈ–స్టోర్‌లో 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.64 లక్షల స్టోర్స్‌ పని చేస్తుండగా, ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటివరకు రూ. 643 కోట్ల పైచిలుకు వ్యాపారం చేశాయి.

చదవండి: ‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ వైరల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top