breaking news
capital funds
-
గ్రామీణ ఎంట్రప్రెన్యూర్లకు అదానీ క్యాపిటల్ నిధులు
న్యూఢిల్లీ: వచ్చే మూడు నెలల్లో సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్స్ నిర్వహిస్తున్న 1,500 మంది గ్రామీణ స్థాయి ఎంట్రప్రెన్యూర్లకు (వీఎల్ఈ) నిర్వహణ మూలధనాన్ని సమకూర్చనున్నట్లు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ అదానీ క్యాపిటల్ వెల్లడించింది. దీనికి సంబంధించి సీఎస్సీ ఈ–గవర్నె న్స్ సర్వీసెస్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 10,000 మంది వీఎల్ఈలు సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్స్‌లో నమోదు చేసు కున్నారు. ఎఫ్ఎంసీజీ, గృహోపకరణాలు, వాహనాలు మొదలైన వాటి తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరుగా పంపిణీ చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. కేంద్ర ఎ లక్ట్రానిక్స్, ఐటీ శాఖ కింద స్పెషల్ పర్పస్ వెహికల్‌గా సీఎస్సీ ఏర్పాటైంది. ఇది 2020 ఏప్రిల్‌లో గ్రా మీణ్ ఈ–స్టోర్‌ను ప్రారంభించింది. అదానీ గ్రూప్‌నకు సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్‌లో 10 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3.64 లక్షల స్టోర్స్ పని చేస్తుండగా, ప్రారంభించినప్పట్నుంచి ఇప్పటివరకు రూ. 643 కోట్ల పైచిలుకు వ్యాపారం చేశాయి. చదవండి: ‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్ -
బీజేపీ,టీడీపీ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం
-
బాబు సర్కారు మాయాజాలం!
-
ఎవరిది ఉన్మాదం..?
-
రాజధాని నిధులపై తప్పుదారి పట్టిస్తున్నారు: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మించేందుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? వంటి ప్రశ్నలపై మంత్రి నారాయణ సమాధానాలు సభను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కోన రఘుపతి విమర్శించారు. బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వారు మాట్లాడారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రూ. 850 కోట్లు ఇచ్చిందని మంత్రి చెబుతున్నారని, ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పడం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీ రాజధానికి రూ. 2200 కోట్లు ఇచ్చామంటున్నారని, కానీ రాష్ట్రం రూ. 850 కోట్లు అని చెబుతోందని వీటిలో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు.