రాజధాని నిధులపై తప్పుదారి పట్టిస్తున్నారు: ఆర్కే | Alla rama krishna reddy slams minister narayana | Sakshi
Sakshi News home page

రాజధాని నిధులపై తప్పుదారి పట్టిస్తున్నారు: ఆర్కే

Mar 17 2016 10:08 AM | Updated on May 28 2018 3:33 PM

రాజధాని నిధులపై తప్పుదారి పట్టిస్తున్నారు: ఆర్కే - Sakshi

రాజధాని నిధులపై తప్పుదారి పట్టిస్తున్నారు: ఆర్కే

రాజధాని నిర్మించేందుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది? ఎన్ని నిధులు ఖర్చు చేశారు?..

సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మించేందుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది? ఎన్ని నిధులు ఖర్చు చేశారు? వంటి ప్రశ్నలపై మంత్రి నారాయణ సమాధానాలు సభను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కోన రఘుపతి విమర్శించారు.

బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో వారు మాట్లాడారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం రూ. 850 కోట్లు ఇచ్చిందని మంత్రి చెబుతున్నారని, ఈ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పడం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.  బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఏపీ రాజధానికి రూ. 2200 కోట్లు ఇచ్చామంటున్నారని, కానీ రాష్ట్రం రూ. 850 కోట్లు అని చెబుతోందని వీటిలో ఏది నిజమో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement