2024 ప్రారంభంలోనే పరేషాన్.. ఐటీ ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన కలవరం! | Sakshi
Sakshi News home page

రెండు వారాలు.. 7500 ఉద్యోగాలు - ఐటీ ఉద్యోగుల్లో మళ్ళీ మొదలైన కలవరం!

Published Mon, Jan 15 2024 3:56 PM

7500 Layoffs In First Two Weeks Of 2024 - Sakshi

2023 ముగిసింది, కొత్త సంవత్సరం 2024 అయినా కలిసొస్తుందేమో అనుకున్న ఐటీ ఉద్యోగులకు మొదటి రెండు వారాల్లోనే చుక్కెదురైంది. ఇప్పటికి 46 ఐటీ అండ్ టెక్ కంపెనీలు సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

గత ఏడాది చివరి వరకు ఉద్యోగాల తొలగింపులను చేపట్టిన చాలా కంపెనీలు.. ఈ ఏడాది ప్రారంభంలో కూడా అదే ఫాలో అవుతున్నాయి. ఇందులో భాగంగానే 46 కంపెనీలు జనవరి 14 వరకు 7,528 మంది ఉద్యోగాల ఉద్యోగాలను తొలగించినట్లు layoff.fyi అందించిన లేటెస్ట్ డేటాలో తెలిసింది.

  • 2024 ప్రారంభంలోనే ఆన్‌లైన్ రెంటల్ ప్లాట్‌ఫారమ్ ఫ్రంట్‌డెస్క్ రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్ ద్వారా ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగించేసింది.
  • గేమింగ్ కంపెనీ యూనిటీ కూడా ఉన్న ఉద్యోగుల్లో సుమారు 25 శాతం మందిని లేదా 1800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. 
  • హార్డ్‌వేర్, కోర్ ఇంజనీరింగ్ అండ్ గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లలో అనేక వందల ఉద్యోగాలను తగ్గించినట్లు గూగుల్ గత వారం ధృవీకరించింది.
  • అమెజాన్ యాజమాన్యంలోని ఆడియోబుక్ అండ్ పాడ్‌కాస్ట్ డివిజన్ ఆడిబుల్ ఈ-కామర్స్ దిగ్గజంలో మొత్తం ఉద్యోగాల కోతలో భాగంగా తన సిబ్బందిలో 5 శాతం లేదా 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది.
  • మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ కూడా నూతన సంవత్సరంలోనే కొంతమంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌లను తొలగించింది.
  • డిస్నీ యాజమాన్యంలోని యానిమేషన్ స్టూడియో పిక్సర్ కూడా ఈ ఏడాది ఉద్యోగాలను తగ్గించబోతున్నట్లు ఇప్పటికే వెల్లడించింది.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement