రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త! | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త!, వందే భారత్‌ తరహాలో సాధారణ రైళ్లు!

Published Fri, Feb 2 2024 4:16 PM

40,000 Rail Coaches Upgraded To Vande Bharat Styled Coaches - Sakshi

ఇకపై దేశంలోని పాతరైలు భోగీలు కనుమరుగు కానున్నాయి. వాటి ‍స్థానంలో వందే భారత్‌ భోగీలు ప్రత్యక్షం కానున్నాయి. ప్రయాణికులకు సేవలందించనున్నాయి. రద్దీని తగ్గించడం, ఇంధనం, సిమెంట్, పోర్ట్ కనెక్టివిటీ మార్గాల్లో వేగంగా సరకు రవాణా చేసేలా కేంద్రం రైల్వే రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొనసాగుతున్న మధ్యంతర పార్లమెంట్‌ సమావేశాల్లో రైల్వే రంగానికి బడ్జెట్‌ కేటాయింపులపై కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన చేశారు. 

2024-2025 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే రంగానికి బడ్జెట్‌ రూ.2.55 లక్షల కోట్లకు పెంచారు. ఈ కేటాయింపులు గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2.41లక్షల కోట్లుగా ఉన్నాయి.  

మూడు ఎకనమిక్‌ రైల్వే కారిడార్లు
ఈ సందర్భంగా..వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు ప్రధాన ఎకనమిక్‌ రైల్వే కారిడార్ ప్రాజెక్టులను అమలు చేస్తామని సీతారామన్ చెప్పారు. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి, ఖర్చును తగ్గించేలా విద్యుత్‌, ఖనిజ, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లు. ఈ మూడు కారికాడార్లను గుర్తించి మల్టీ మోడల్‌ కనెక్టివిటీ చేసేందుకు గాను ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద కేంద్రం ఈ ప్రాజెక్ట్‌లను గుర్తించింది.  

40వేల వందే భారత్‌ రైలు భోగీలు
40వేల సాధారణ రైలు బోగీలను (కోచ్‌లు) వందే భారత్ భోగీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని, భద్రత, సౌలభ్యం, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచుతామని సీతారామన్ అన్నారు. . రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) రిటైర్డ్ డైరెక్టర్ కేబీల్‌ వాధ్వా మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతం ఉన్న బోగీలు కాలం చెల్లిన డిజైన్‌తో ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త వందే భారత్ భోగీలు రానున్నాయి. అధిక వేగం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందుతుందన్నారు.  


ప్రయాణికుల రద్దీని తగ్గించేలా 

‘ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రైల్వే కారిడార్‌లలో రద్దీని తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న రైల్వే కారిడార్‌లలో మరిన్ని కొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చేలా, ప‍్రయాణికుల రాకపోకల్ని మరింత సులభతరం చేసేలా భవిష్యత్‌ ప్రణాళికల్ని రూపొందించాం. తద్వారా ప్రయాణికుల భద్రత, అధిక ప్రయాణ వేగం పెరగడం ద్వారా ప్యాసింజర్ రైలు సేవలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ మూడు రైల్వే ఎకనమిక్‌ కారిడార్‌లతో దేశీయ ఎకనామీ వృద్ది సాధిస్తుంది. లాజిస్టిక్ ఖర్చులను తగ్గిస్తాయని అని ఆమె తెలిపారు.

11 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులు
అనంతరం ఈ కారిడార్‌లలో మొత్తం 11 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులు చేపట్టనున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘ప్రణాళిక ప్రకారం,రాబోయే 6 నుంచి 8ఏళ్ల కాలంలో సుమారు 40వేల కిలోమీటర్ల మేర ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ని కోచ్‌లను మెరుగైన సౌకర్యాలు ఉండేలా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు.

దీని కోసం రూ.15,200 కోట్లు ఖర్చవుతుందని, వచ్చే ఐదేళ్లలో దీన్ని అమలు చేయన్నట్లు మంత్రి మధ్యంతర బడ్జెట్‌ ప్రసంగంలో వివరించారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంజన్లు, వ్యాగన్లు, కోచ్‌ల వంటి రోలింగ్ స్టాక్‌లను కొనుగోలు చేయడానికి 41,086.09 కోట్ల రూపాయలను కేటాయించాలని కేంద్రం మధ్యంతర బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు తెచ్చింది.

చదవండి :  హెచ్‌1బీ వీసాపై అమెరికా కీలక ప్రకటన

Advertisement
Advertisement