గాలిని శుభ్రం చేసే ఈ డబుల్‌ ధమాకా గాడ్జెట్‌ గురించి మీకు తెలుసా

2022 Air Purifier Ultra Mosquito Repellent Review - Sakshi

ఈ ఫొటోలో గోడకు ఏదో అమర్చినట్లు కనిపిస్తోంది కదూ! గోడకు ఏమీ అమర్చలేదు గాని, ప్లగ్‌లో పెట్టిన చిన్న సాధనమిది. ఇదొక డబుల్‌ ధమాకా పరికరం. దీనిని ప్లగ్‌లో పెట్టి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు, గదిలోని గాలిని శుభ్రపరచడమే కాకుండా, దోమలనూ పారదోలుతుంది.

 ఈ ‘2022 ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్‌’ పరికరాన్ని అమెరికన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ‘కార్నర్‌షాప్స్‌’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్‌ ప్యురిఫయర్‌ కమ్‌ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్‌ పరికరం వివిధ దేశాల్లోని వాల్‌మార్ట్‌ స్టోర్స్‌లోనూ దొరుకుతుంది. 

దీనిని ఆన్‌ చేశాక ప్రతి 40 సెకండ్లకు ఒకసారి కొద్దిసేపు దీని నుంచి సన్నని ధ్వని వెలువడుతుంది. ఈ పరికరం గాలిలోని దుర్వాసనను పోగొడుతుంది. గాలిలోని హానికరమైన జీవ రసాయనిక కణాలను తొలగిస్తుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top