Layoffs: నోకియా సంచలన నిర్ణయం..14వేల మందికి ఉద్వాసన! | 14 Thousand People Will Remove From Nokia | Sakshi
Sakshi News home page

Nokia Job Cuts: నోకియా సంచలన నిర్ణయం..14వేల మందికి ఉద్వాసన!

Oct 19 2023 8:57 PM | Updated on Oct 19 2023 9:06 PM

14 Thousand People Will Remove From Nokia - Sakshi

కార్పొరేట్‌ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం పేరిట ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ఐటీ సెక్టార్ మాత్రమే కాకుండా ఇతర రంగాలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచనలో ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ వేల మంది సిబ్బందికి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. 

నోకియా కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ఏకంగా తన కంపెనీలో పనిచేస్తున్న 14 వేల మందిని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది.

ఉత్తర అమెరికాలో సంస్థ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మూడో త్రైమాసికంలోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో రానున్నరోజుల్లో కాస్ట్‌కటింగ్‌ పేరిట ఉద్యోగుల కోత విధించనుంది. ప్రస్తుతం నోకియాలో 86 వేల మంది పని చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement