సీఎండీ వరుణ్‌రెడ్డి ఆలోచనతో
ఎన్పీడీసీఎల్ ట్రస్ట్ ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో నాలుగు సంస్థలకు అధికారుల, ఉద్యోగుల తోడ్పాటు
అందరూ కలిసి
ప్రతి నెలా రూ.80 వేలసాయం
విద్యుత్ ఉద్యోగుల వంతుగా ఆపన్నహస్తం
అనాథ ఆశ్రమాల్లో
కాంతి రేఖలు
ఉమ్మడి జిల్లాలో నాలుగు సంస్థలకు సాయం
ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా రూ. 20 వేల చొప్పున నాలుగు సంస్థలకు మొత్తం రూ. 80 వేలు ఆర్థికసాయం చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో అనాథలతోపాటు ఆదరణ లేని పెద్దలు, దివ్యాంగులు ఆశ్రయం పొందుతున్నారు. భోజనం, మందులు, బట్టలు, సంరక్షణకు నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఖమ్మం రోటరీ నగర్‌లో ఉన్న అన్నం సేవా ఫౌండేషన్, మధిర మండలం దిడుగులపాడులో ఉన్న మరణాత ఆర్కే ఫౌండేషన్, పాల్వంచలోని శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ (చెవిటి, మూగ, దివ్యాంగ సంక్షేమం), భద్రాచలం శాంతి నగర్‌లోని మానవ సేవా వలంటరీ ఆర్గనైజేషన్‌కు తోడ్పాటనందిస్తున్నారు.
ఉద్యోగుల స్వచ్ఛంద సహకారంతో..
ప్రతీ ఉద్యోగి నెలకు కనీసం రూ. 50. కొందరు రూ. 100, రూ. 500, రూ. 1000, మరికొందరు వేల రూపాయలు కూడా స్వచ్ఛందంగా ఇస్తున్నారు. ప్రతి నెలా రూ. 5.60 లక్షలు సమకూరుతుండగా ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో 27 స్వచ్ఛంద సంస్థలకు నెలకు రూ. 20 వేల చొప్పున అందిస్తున్నారు. చట్టబద్ధత కలిగి, విజిలెన్స్ క్లియరెన్స్ పొందిన సంస్థలకే సాయం అందిస్తున్నారు. దీంతో ప్రతీ రూపాయి అవసరమున్న వారికే చేరుతోంది. కార్మిక సంఘాలు, వివిధ ఉద్యోగ సంఘాల స్వచ్ఛంద అంగీకారంతోనే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
అనాథలు, వృద్ధులకు విద్యుత్ శాఖ ఆర్థికసాయం
ఎన్పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యుత్ అధికారులు, ఉద్యోగులు ప్రతి నెలా వారీ వేతనాల నుంచి కొంత మొత్తం సాయం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో రెండు అనాథల ఆశ్రమాలకు రూ. 40 వేలు అందిస్తున్నాం. ఈ తోడ్పాటు సంస్థకు, ప్రతి ఉద్యోగికి కొంత మేరకై నా సంతృప్తినిస్తుంది.
–ఇనుగుర్తి శ్రీనివాసాచారి,
ఎస్‌ఈ, ఖమ్మం విద్యుత్ సర్కిల్


