అశ్వాపురం: మండల పరిధిలోని అమెర్ద గ్రామపంచాయతీ తెల్లంవారి గుంపు గ్రామానికి చెందిన కల్లూరి దక్షిత్ ఈ నెల 27న జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో ఇంటర్ డిస్ట్రిక్ట్ పోటీలకు ఎంపికయ్యాడు. దక్షిత్ పాల్వంచలోని కిన్నెరసాని గురుకుల పాఠశాలలో 9వతరగతి చదువుతున్నాడు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న నిరుపేద కుటుంబానికి చెందిన దక్షిత్‌కు ప్రయాణ ఖర్చులు, క్రీడా సామగ్రి, ఇతర అవసరాల నిమిత్తం స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత క్రీడా శాఖ అధికారులు, ఐటీడీఏ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందించి అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు..
దుమ్ముగూడెం: మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల 8వ తరగతి విద్యార్థి కుంజా నితిన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ( ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 ఉమ్మ డి జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో రాణించాడు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని హెచ్‌ఎం పి. నరసింహారావు, ఉపాధ్యాయులు హరికృష్ణ, గంగరాజు, నాగేశ్వరరావు అభినందించారు.
డిసెంబర్ 10 వరకే ఓటు దరఖాస్తుకు అవకాశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): డిసెంబర్ 10 వరకు అర్హులైన ప్రతీ ఓటరుకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించేందుకు అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి శనివారం రాత్రి ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, సూపరింటెండెంట్ రంగ ప్రసాద్ పాల్గొన్నారు.
28 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్‌అదాలత్ విజయవంతమైందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జి. ప్రేమలత, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ తెలిపారు. కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు మణుగూరు, దమ్మపేట కోర్టుల పరిధిలో 28 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. కక్షిదారులకు రూ. 1,14,28,000 సెటిల్‌మెంట్ నగదు అందిందని తెలిపారు.
వందశాతం
ఉత్తీర్ణత సాధించాలి
పాల్వంచరూరల్: గురుకుల విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్‌లు, ఇంటర్, టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి గుగులోతు రవి సూచించారు. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలోని బాలుర గురుకులాన్ని శనివారం సందర్శించారు. విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ సిల్స్ పెంపొందించాలని చెప్పారు. సీఓఈ కోఆర్డీనేటర్ కిషోర్, ఆర్‌సీఓ అపర్ణ, ప్రిన్సిపాల్ అన్వేష్ పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలి
చుంచుపల్లి: జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలు, ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో తనిఖీలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పీసీపీఎన్ డీటీ మల్టీ మెంబర్ అథారిటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కమిటీల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అధికారులు రాకేష్, రాందాస్, ప్రతాప్, సతీష్, సుధాకర్ రావు, చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


