పోరాటానికి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

పోరాటానికి సిద్ధం కావాలి

Nov 22 2026 2:23 AM | Updated on Nov 22 2026 2:23 AM

● 13 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదు.. ● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

● 13 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ బీసీలకు చేసిందేమీ లేదు.. ● బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌

ఇల్లెందు: ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ తన 13 ఏళ్ల పాలనలో బీసీ వర్గానికి చేసిన న్యాయం ఏమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. శనివారం ఇల్లెందులో బీసీల జనభేరి వాల్‌ పోస్టర్లను అవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీసీలు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. జనవరి 10 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇందులో బీసీలకు ప్రత్యేక కాలం చేర్చకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ప్రతీ కులానికి ప్రత్యేక సంఖ్య కేటాయించి కులాల వారీగా జనగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్‌ 14, 15 తేదీల్లో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో బీసీల జనభేరి నిర్వహించనున్నట్లు తెలిపారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 25 శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్యాయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 18శాతం మాత్ర మే రిజర్వేషన్లు అమలవుతున్నాయని, రాజకీయ రంగంలోనూ తగిన ప్రాతినిధ్యం లేదని విమర్శించారు. జనభేరికి ప్రతి గ్రామం నుంచి బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి డత వెంకట్‌ గౌడ్‌, నాయకులు దండ రామచందర్‌, బంధం నాగయ్య, దండు సారయ్య, కోడి రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement