కలెక్టర్‌ జపాన్‌ పర్యటన విజయవంతం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ జపాన్‌ పర్యటన విజయవంతం

Nov 22 2026 2:23 AM | Updated on Nov 22 2026 2:23 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): నీతి ఆయోగ్‌, జపాన్‌ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) సంయుక్తంగా ఆకాంక్షిత మండలాల కార్యక్రమం కింద జపాన్‌లో నిర్వహించిన అధ్యయన పర్యటనను కలెక్టర్‌ అంకిత్‌ శనివారంతో విజయవంతంగా పూర్తి చేశా రు. ఈ నెల 15 నుంచి 21 వరకు పర్యటన సాగగా, ముగింపు కార్యక్రమంలో కలెక్టర్‌ ధ్రువపత్రం అందుకున్నారు. కలెక్టర్‌ తన బృందంతో కలిసి జపాన్‌లోని నెరిమా నగరంలోని టొయోటామా ప్రాథమిక పాఠశాలలో గమనించిన అంశాలపై సాంకేతిక, విధానపరమైన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణ అంశాలను వివరించారు. వీటిలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యా ప్రమాణాల పెంపునకు అనుసరించదగిన విధానాలపై చర్చించారు. స్థానిక పాలన, ప్రజలకు ప్రభుత్వ సేవల వర్తింపు, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై నిర్వహించిన అధ్యయన సమావేశాలు, క్షేత్రస్థాయి సందర్శనల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు. మిటో నగరంపై నిర్వహించిన కేస్‌ స్టడీ ద్వారా స్థానిక సంస్థలు ప్రజల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా సేవలు అందిస్తున్న తీరు ను అధ్యయనం చేశారు. సోనీ సంస్థపై నిర్వహించిన కేస్‌స్టడీలో సంస్థాగత మార్పుల అమలు తదితర అంశాలను పరిశీలించారు. జపాన్‌ పర్యటనలో గమనించిన మేలైన పద్ధతులను జిల్లాలోని ఆకాంక్షిత మండలాల్లో అమలు చేసేందుకు కృషి చేయనున్నారు.

ఆకాంక్షిత మండలాల అభివృద్ధికి

ఉత్తమ విధానాలపై అధ్యయనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement