అనారోగ్యంతో హోంగార్డు మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో హోంగార్డు మృతి

Nov 19 2026 12:31 AM | Updated on Nov 19 2026 12:31 AM

సూపర్‌బజార్‌(పాల్వంచ): పాల్వంచ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కత్తుల కుటుంబరావు(46) అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. మృతదేహాన్ని గార్ల మండలంలోని ఆయన స్వగృహానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని ఎస్‌ఐ టి.నాగరాజు, సిబ్బంది సందర్శించి సంతాపం తెలిపారు.

సింగరేణి ఉద్యోగి..

టేకులపల్లి: మండలంలోని కొత్తతండా(పి) గ్రామానికి చెందిన ఆంగోత్‌ కాశీరాం (50) కోయగూడెం ఓపెన్‌కాస్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సింగరేణి అధికారులు కిషన్‌, అశోక్‌, భూక్య నాగేశ్వరరావు, ఐఎన్‌టీయూసీ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ముచ్చ సుధాకర్‌, అంతోటి రాకేష్‌ తదితరులు కొత్తతండా(పి)లో మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. దహన సంస్కారాలకు రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు.

ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష

సూపర్‌ బజార్‌ (కొత్తగూడెంఅర్బన్‌): గాయపరిచిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి కర్ణాటి కవిత బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌ అంబేద్కర్‌ ఏరియాకు చెందిన గంటా మహేష్‌రావుపై పుల్లూరి మల్లికార్జున్‌ అనే వ్యక్తి దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటనలో 2022, డిసెంబర్‌ 15న కొత్తగూడెం రెండో టౌన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తి విచారణ చేపట్టగా నేరం రుజువు కావడంతో మల్లికార్జున్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఏపీపీ కారం రాజారావు వాదనలు వినిపించగా, సిబ్బంది జి.రాఘవయ్య, సీహెచ్‌. వీరబాబు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement