పదోన్నతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పదోన్నతులు కల్పించాలి

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

రుద్రంపూర్‌: సింగరేణిలోని వివిధ ఏరియాల్లో పని చేస్తున్న ఎన్‌సీడబ్ల్యూఏ, ఔట్‌ సోర్సింగ్‌, , టైమ్‌రేటెడ్‌ కార్మికులకు పదోన్నతులు, కేడర్‌స్కీమ్‌, బోనస్‌ అందేలా చర్యలు చేపట్టాలని జీఎం పర్సనల్‌ (ఐఆర్‌పీఎం) జీవీ కిరణ్‌కుమార్‌ సూచించారు. సోమవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి సంస్థవ్యాప్తంగా పర్సనల్‌ విభాగం సిబ్బందితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు దసరా పండుగకు అందాల్సిన లాభాల బోనస్‌ను కాంట్రాక్టర్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. అధికారులు వెంకటేశ్వరరావు, రాజ గోపాల్‌, దేవెందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

పాల్వంచరూరల్‌: విద్యార్థులు చదువుపై మనసుల గ్నం చేసి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి వెంకటేశ్వరరావు అన్నారు. మండలపరిధిలోని ప్రభుత్వ జూనియర్‌ కళా శాల్లో సోమవారం అధ్యాపకులు, దాతలసహకారంతో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనాన్ని లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌ భూక్యా మంజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫలితాల మెరుగుకు 3 మాసాలపాటు మధ్యాహ్నంభోజనం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ పి.శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement