నేడు అప్పగింతలు
● న్యూ గొల్లగూడెం రోడ్ విస్తరణకు తొలగిన అడ్డంకులు ● నేడు రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వే భూముల అప్పగింత ● బదులుగా ఖమ్మంలో రైల్వేకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పదిహేనేళ్లుగా జిల్లాలో ట్రాఫిక్ చిక్కులకు కారణమవుతున్న సూపర్‌బజార్–న్యూగొల్లగూడెం రోడ్డు విస్తరణ పనులు మొదలుకానున్నాయి. ఈ రోడ్డు విస్తరణకు ఇన్నాళ్లు అడ్డుగా ఉన్న రైల్వే స్థల సేకరణ సమస్య నేటితో తీరనుంది.
రెండేళ్లుగా..
న్యూ గొల్లగూడెం రోడ్డు విస్తరణ కోసం కొత్తగూడెం (బీడీసీఆర్) స్టేషన్ వద్ద 4,556 చ.మీ. (5,449 చదరపు గజాలు) రైల్వేభూమి అవసరమని, ఈ భూమి కి బదులుగా ఖమ్మం రైల్వేస్టేషన్ వద్ద 3,969.5 చ.మీ. రాష్ట్ర ప్రభుత్వ భూమిని రైల్వేకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు 2024 సెప్టెంబరు 26న తొలిసారి 2025 అక్టోబరు 17న రెండో సారి భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచి చివరకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఆ తర్వాత ఇదే విషయాన్ని 2025 నవంబరు 14న సిద్ధమని రైల్వేబోర్డు చైర్మన్ సతీశ్ కుమార్‌కు 2025 నవంబరు 14న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి వివరించారు.
పది నెలలకు వీడిన సందిగ్ధత
భూ బదలాయింపు విషయంలో కొత్తగూడెంలో రైల్వేబోర్డు మన రాష్ట్రానికి అప్పగించే స్థలం మార్కె ట్ విలువ కంటే ఖమ్మంలో రైల్వేకు కేటాయించే స్థలం మార్కెట్ విలువ మూడురెట్లు ఎక్కువగా ఉందని తేలింది. మరోవైపు కొత్తగూడెంలో అప్పగించే స్థలంలో రైల్వేకు సంబంఽధించి ప్రహరీ, పార్కింగ్ షెడ్లు, క్వార్టర్లు, సులభ్ కాంప్లెక్స్ తదితర శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. ఒక్కో నిర్మాణానికి రూ.17 లక్షల వంతున నష్ట పరిహారం చెల్లించాలని రైల్వే డిమాండ్ చేసింది. దీంతో భూ మార్పిడి ప్రక్రియ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై దాదాపు పదినెలల పాటు సందిగ్ధత నెలకొంది. చివరకు గత ఆగస్టులో జరిగిన దిశా సమావేశంలో ఈ అంశాన్ని ఎంపీ రఘురాంరెడ్డి లేవనెత్తారు. అనంతరం రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు.. చివరకు ఎటువంటి చెల్లింపులు లేకుండా కేవలం స్థలాల అప్పగింతతో ఈ వ్యవహారాన్ని ముగించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.
రైల్వేశాఖకు ఖమ్మంలో ఎకరం స్థలం అప్పగి స్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికా రులు సైతం కొత్తగూడెంలో తమకు సంబంధించిన స్థలాలను రాష్ట్ర సర్కార్‌కు బదలా యించేందుకు మంగళవారం కొత్తగూడెం వస్తున్నా రు. జిల్లా అధికారులకు భూమి అప్పగింతకు సంబంధించిన దస్తావేజులను రైల్వే అధికారులు అందివ్వనున్నారు.కార్యక్రమానికి ఎంపీ రఘురాంరెడ్డి కూడా హాజరవుతున్నారు. న్యూగొల్లగూడెం రోడ్డులో రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి మున్సిపల్ మార్కెట్ వరకు (కిరోసిన్ పంప్) వరకు ఎడమ వైపున 7 మీటర్ల మేరకు రైల్వే వెనక్కి తగ్గనుంది.


