ప్రజావాణికి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి విశేష స్పందన

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

● పింఛన్‌ మంజూరు కాలేదని పలువురి ఫిర్యాదు ● బాలల ప్రజావాణిలో ఆధార్‌కార్డులు, స్కాలర్‌షిప్‌లపై దరఖాస్తులు

● పింఛన్‌ మంజూరు కాలేదని పలువురి ఫిర్యాదు ● బాలల ప్రజావాణిలో ఆధార్‌కార్డులు, స్కాలర్‌షిప్‌లపై దరఖాస్తులు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరి ష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి విశేష స్పందన లభించింది. ఇటీవల ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూ రు చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది తమకు అర్హత ఉన్నా పింఛన్‌ మంజూరు చేయలేదని కలెక్టరేట్‌కు వచ్చి మొరపెట్టుకున్నారు. ప్రత్యేకంగా బాల ల ప్రజావాణి కూడా నిర్వహించడంతో ఆధార్‌ కార్డు తదితర సమస్యలపై పలువురు తల్లిదండ్రులు అర్జీలను అందించారు. అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్‌, విద్యాచందన దరఖాస్తులను స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. పింఛన్‌ మంజూరు కాలేదని పలు వురు వృద్ధులు స్వచ్ఛందంగా వచ్చి అర్జీ అందించగా, కొందరు కార్పొరేటర్లు, సర్పంచ్‌లు కూడా అర్హులను తీసుకొచ్చి దరఖాస్తులు చేయించారు. విచా రించి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ విద్యాచందన హామీ ఇచ్చారు.

బాలల ప్రజావాణిలో 73 దరఖాస్తులు

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్‌ భాగస్వామ్యంతో ‘నా రోజు.. నా హక్కులు.. నా భవిష్యత్‌’అనే నినాదంతో పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా భర్త మరణించిన మహిళలు తమ పిల్లలకు మిషన్‌ వాత్సల్య స్పాన్సర్‌షిప్‌ ఇప్పించాలని కోరు తూ దరఖాస్తులను అందజేశారు. చదువులకు ఆర్థిక భరోసా కల్పించానే విజ్ఞప్తి చేశారు. పిల్లల ప్రజా వాణిలో మొత్తం 73 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ పిల్లల ప్రజావాణి ద్వారా బాలల అవసరాలు, సమస్యలు, అభిప్రాయాలు, ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకుని వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే అవకాశం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ అనూష, జిల్లా సంక్షేమ అధికారి కేఎం తార, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యుడు ఎండీ సాధిక్‌ పాషా, ఎస్‌ సుమిత్రాదేవి, కె అంబేద్కర్‌, బాలల సంరక్షణ అధికారి ఎం.హరికుమారి, నేషనల్‌ న్యూట్రిషన్‌ అధికారి రూప, సందీప్‌ కుమార్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement