డేటా సెంటర్లు ! | - | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్లు !

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

● మూసివేసిన బొగ్గు గనుల్లో ఏర్పాటు చేసే అవకాశం ● అంతర్జాతీయంగా భూగర్భంలోనే ఏర్పాటుకు మొగ్గు ● దేశంలోని కోలిండియాలో కూడా ప్రయత్నాలు ● సింగరేణితో జట్టు కట్టేందుకు ‘అమెరికా’ ఆసక్తి

ఆసక్తి చూపిస్తున్న అమెరికా

● మూసివేసిన బొగ్గు గనుల్లో ఏర్పాటు చేసే అవకాశం ● అంతర్జాతీయంగా భూగర్భంలోనే ఏర్పాటుకు మొగ్గు ● దేశంలోని కోలిండియాలో కూడా ప్రయత్నాలు ● సింగరేణితో జట్టు కట్టేందుకు ‘అమెరికా’ ఆసక్తి

ఫ్యూచర్‌ డేటా సెంటర్లదే..

ఆర్టిిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధిపత్యం ప్రతీ రంగంపై పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆరంభ దశలో ఈ విజృంభన ఉన్నా రాబోయే రోజుల్లో మరింతగా విస్తరించనుంది. ఏఐ రంగం ప్రధానంగా ఆధారపడేది విస్తారమైన సమాచారం, ఆ సమాచారాన్ని అత్యంత వేగంగా విశ్లేషించి, కోరిన విధంగా అందివ్వడం. ఇలా పనులు చేసేందుకు జిగాబైట్ల కొద్దీ మెమోరీని స్టోరేజీ చేయాలి. వీటినే డేటా సెంటర్లుగా పేర్కొంటారు. వీటి స్థాపన, నిర్వహణకు స్థలం, విద్యుత్‌, నీరు భారీ ఎత్తున ఉపయోగించాల్సి ఉంటుంది. డేటా సెంటర్లలో ఎల్లవేళలా చల్లదనం ఉంచేందుకు విద్యుత్‌, నీరు అవసరం ఎక్కువగా పడుతుంది. దీంతో డేటా సెంటర్లకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నప్పటికీ స్థలం, విద్యుత్‌, నీరు వంటి మౌలిక వసతులు కల్పించడం ఇబ్బందితో కూడుకు న్న వ్యవహారంగా మారింది. తక్కువ ఖర్చు, నిర్వహణ వ్యయం ఉండేలా డేటా సెంటర్ల నిర్మాణంపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

మూసివేసిన గనులపై దృష్టి

భూగర్భంలో నిక్షిప్తమైన ఖనిజాలను వెలికితీశాక మూసివేసిన గనుల్లో డేటా సెంటర్ల స్థాపన సానుకూలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూగర్భంలో జలాలు అందుబాటులో ఉంటాయి. ఆ గనుల కోసం అప్పటికే స్థల సేకరణ కూడా జరిగి ఉంటుంది. వీటికి తోడు వరదలు, తుపానులు, యుద్ధాలు వంటి ప్రకృతి విపత్తుల నుంచి సహజ రక్షణ లభిస్తుంది. ఈ అనుకూల అంశాల బేరీజు అనంతరం అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. గతేడాది ఇటలీలో 5 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌ను భూగర్భ గనిలో ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నా రు. మరికొన్ని దేశాలు ముందుగా కోల్డ్‌వార్‌ సమయంలో నిర్మించిన బంకర్లలో ప్రాథమిక స్థాయిలో డేటా సెంటర్ల ఏర్పాటు, వాటి పనితీరును అంచనా వేస్తూనే... క్రమంగా లైమ్‌స్టోన్‌ మైన్స్‌ వైపు దృష్టి సారిస్తున్నాయి.

కోలిండియా మొదలెట్టింది

భూగర్భంలో డేటా సెంటర్ల విదేశాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతోంది. అలాగే, మూసివేసిన బొగ్గు గనుల్లో వాటి ఏర్పాటు పరిశీలన మన దగ్గర రెండేళ్ల కిందటే మొదలైంది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా పేరు ఉన్న కోలిండియా ఇప్పటికే చేపట్టింది. ఆ సంస్థకు సంబంఽధించి మూసివేసిన గనుల్లో, ఏ గనులు డేటా సెంటర్‌ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయనే అంశంపై ఇప్పటికే కన్సల్టెంట్లను నియమించి ప్రాథమిక సర్వే చేపట్టింది. అందులో దేశవ్యాప్తంగా ఉర్మర్‌ (వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్‌, మహారాష్ట్ర), కోర్బా(సౌత్‌ ఈస్ట్రర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ ఛత్తీస్‌గఢ్‌), జార్సుగూడ (మహానది కోల్‌ఫీల్డ్స్‌, ఒడిశా), నిగాలి(నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్‌, మధ్యప్రదేశ్‌) గనులు డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్టు గుర్తించారు. తాజాగా సింగరేణి సైతం ఈ రంగంలోకి దిగింది.

సింగరేణితో కలిసి డేటా సెంటర్ల ఏర్పాటుకు అమెరికా ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్‌ జ్యోతితో అమెరికా కాన్సులేట్‌కు చెందిన పొలిటికల్‌, ఎకనామికల్‌ చీఫ్‌ మెరెడిత్‌ మెజ్లర్‌ బృందం చర్చలు జరిపింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని అమెరికన్‌ టీమ్‌ ఆసక్తి చూపగా, మూసివేసిన గనుల దగ్గర పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్‌ ద్వారా నిరంతర కరెంటు సరఫరాకు తమకు అభ్యంతరం లేదని సింగరేణి అధికారులు వెల్లడించారు. ఈక్రమాన జాయింట్‌ వెంచర్‌గా డేటా సెంటర్ల ఏర్పాటు అంశంపై ఇరు పక్షాలు సానుకూలంగా స్పందించాయి. వచ్చే ఏప్రిల్‌లో అమెరికాలో జరిగే రేర్‌ ఎర్త్‌ సమ్మిట్‌కు సింగరేణికి అమెరికా నుంచి ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement