వైభవంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రామయ్య కల్యాణం

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి నిత్యకల్యాణం వైభవోపేతంగా జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో కల్యాణమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవాచనం చేశా రు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

పెద్దమ్మతల్లికి

పంచామృతాభిషేకం

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు.

కేవీకేలో కిసాన్‌ మేళా

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఐసీఏఆర్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ సహకారంతో శుక్రవారం కేవీకే ప్రాంగణంలో కిసాన్‌ మేళా, జొన్న విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్‌–ఐఐఎంఆర్‌ సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఎ.శ్రీనివా స్‌ మాట్లాడుతూ చిరుధాన్యాలతో వివిధ విలు వ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయ డం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.స్రవంతి జొన్న, సజ్జ, రాగి పంటల్లో పాటించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులను వివరించారు. అధికారులు టి.భరత్‌, శోభన్‌ బాబు, స్రవంతి, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

16న పిల్లల ప్రజావాణి

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నేతృత్వంలో ఈ నెల 16న పిల్లల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్‌ జిల్లా సంక్షేమ అధికారి తార ఒక ప్రకటనలో తెలిపారు. బాలలు ఎదుర్కొంటు న్న సమస్యలు, బాలల హక్కుల ఉల్లంఘనలు, బాలకార్మికత్వం, బాల్య వివాహాలు, బాలలపై హింస, నిర్లక్ష్యం, వేధింపులు, ఇతర బాలల పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు, వినతులు స్వీకరించి సంబంధిత అధికా రుల సమన్వయంతో పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. బాలలు, తల్లిదండ్రులు, సంరక్షకులు, ప్రజాప్రతినిధులు, బాలల సంక్షేమం పట్ల ఆసక్తి కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రశాంతంగా

టీజీపీఎస్సీ పరీక్ష

జూలూరుపాడు(సుజాతనగర్‌): సుజాతనగర్‌ మండలం వేపలగడ్డ అబ్దుల్‌ కలాం కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో టీజీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్స్‌, గెజిటెడ్‌ హె డ్మాస్ట్రర్స్‌ గ్రేడ్‌–1 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు మొదటి సెషన్‌లో 90 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 64మంది పరీక్షకు హాజరయ్యారు. 26మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌లో 90 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 64 మంది హాజరయ్యారు. 26 మంది పరీక్షకు హాజరు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement