ఆధార్‌ సేవలు సకాలంలో అందించాలి | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ సేవలు సకాలంలో అందించాలి

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో ఆధార్‌ సేవలను ప్రజలకు మరింత సులభంగా, సకాలంలో అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవా రం జిల్లా స్థాయి ఆధార్‌ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్‌ సేవల అమలు, ఆధార్‌ కేంద్రాల పనితీరు, పెండింగ్‌లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్‌ నవీకరణ, ఆధార్‌ సంబంధిత సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరి జన తెగల సమూహాలకు ఆధార్‌ సేవలు అందించడంపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఆధార్‌ సమస్యలను పరి ష్కరించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. ఆధార్‌ కేంద్రా ల పనితీరు మెరుగుపరచాలని చెప్పారు. విద్యార్థులు ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన, ఇతర అధికారులు నాగలక్ష్మి, శంభూప్రసాద్‌, తుకారాం, రామిరెడ్డి, సైదేశ్వరరావు, కృష్ణమూర్తి, కిరణ్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా రక్షణ కల్పిస్తున్న ట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కలెక్టర్లతో శుక్రవారం నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ప్రతీ కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించే వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్‌, విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ జె.సునీత పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement