బూర్గంపాడు: మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామానికి చెందిన శనగ రవీంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకున్నారు. ఆయన రూపొందించిన ‘యాడ్స్’ చిత్రానికి లండన్ ఇంటర్నేషనల్ సినీ అవార్డ్స్‌లో ఏకంగా 9 విభాగాల్లో అవార్డులు లభించాయి. బెస్ట్ స్టోరీ, బెస్ట్ షార్ట్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ తెలుగు ఫిల్మ్, బెస్ట్ థ్రిల్లర్, బెస్ట్ ఫిల్మ్ మేకర్ విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు. కేటీపీఎస్‌లో ఉద్యోగి అయిన రవీంద్రబాబు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన అభిరుచికి అనుగుణంగా చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శించగా పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు.
జిల్లా స్థాయి
సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపిక
భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థులు సిహెచ్.యగ్నేష్, బి.శ్యామ్ ప్రీతమ్ కృష్ణ 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ‘సుస్థిరత కోసం సైన్స్, ఆవి ష్కరణలు’ ఇతివృత్తంతో రూపొందించిన ‘ఫ్రమ్ ప్లాస్టిక్ టు పాటరీ’ ప్రాజెక్టు జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికై ంది. ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ, మట్టి పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ నెల 11న కొత్తగూడెంలోని జిల్లా శిక్షణ కేంద్రంలో జరిగే ప్రదర్శనలో విద్యార్థులు తమ ప్రాజెక్టు ను ప్రదర్శించనున్నారు. గైడ్ టీచర్ ప్రసాద్‌బాబు మార్గదర్శకత్వంలో విద్యార్థులు ప్రాజెక్టు ను రూపొందించారు. విద్యార్థులను ప్రధానో పాధ్యాయుడు జి. జాన్సన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
అర్ధరాత్రి వరకు
ఆదివాసీల ఆందోళన
పట్టాలు ఇచ్చిన భూములు చూపాలని చండ్రుగొండలో నిరసన
చండ్రుగొండ: మండలంలోని దామరచర్ల గ్రామ శివారులో ఉన్న సీలింగ్ భూములను క్షేత్రస్థాయిలో చూపాలని ఆదివాసీలు తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అక్కడే వంటావార్పు నిర్వహించి, అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. దశాబ్దాల క్రితం సీతాయిగూడెం, అయన్నపాలెం గ్రామాలకు చెందిన 40 మంది ఆది వాసీలకు 136 ఎకరాల సీలింగ్ భూముల పట్టాలను ప్రభుత్వం జారీ చేసింది. కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో భూముల హద్దులు నిర్ణయించి కేటాయించలేదు. దీంతో కొన్నేళ్లుగా ఆదివాసీలు పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లోని లోకా యుక్త కోర్టు భూములు ఆదివాసీలకు కేటా యించాలని ఆదేశాలు జారీ చేసింది. దసరా పండుగ అనంతరం భూ సర్వే నిర్వహించి భూములను కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా హామీ నెరవేర్చకపోవడంతో ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ఆదివాసీ సంఘం నాయకులు రాజిని వెంకటేశ్వర్లు, సిద్దిని సీతా రాములు, వాసం నాగేశ్వరరావు, పిట్టల చుక్క మ్మ, ఆర్ సరోజిని నాయకత్వం వహించారు.
ముగిసిన
ఆపద మిత్ర శిక్షణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): టీజీ ఎస్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ 6వ బెటాలియన్‌లో గత నెల 31న ప్రారంభమైన యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. శిక్షణ పూర్తి చేసిన 49 మంది వలంటీర్లకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. వారం రోజులపాటు ఎస్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై సైద్ధాంతిక, ప్రాయోగిక శిక్షణ అందించారు. రోడ్డు ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, అగ్ని ప్రమాదా లు, ఇతర ప్రమాదాల్లో బాధితులను సురక్షితంగా తరలించే విధానాలు, పాము, తేలు కాట్ల సమయంలో తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు, భూకంపాలు, సునామీలు తదితర విపత్తుల సమయంలో భవనాల్లో చిక్కుకున్న వారి ని రక్షించే పద్ధతులపై తర్ఫీదు ఇచ్చారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ పీసీవీ రమణ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా వినియోగించి ప్రజలకు తక్షణ సహా యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అదనపు కమాండెంట్ ఎస్ శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్లు రామకృష్ణారెడ్డి, రంజిత్‌కుమార్, ఏఓ సత్యవతి, ఆర్‌ఐలు జె లెనిన్ బాబు, శ్రీనివాసరెడ్డి, జీవీ రామారావు, బి.జానయ్య పాల్గొన్నారు.


