మొక్కజొన్నకు మొలకలు | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్నకు మొలకలు

Nov 7 2026 12:48 AM | Updated on Nov 7 2026 12:48 AM

రెండు రోజులపాటు కురిసిన

వర్షాలకు తడిసిన పంట

చేతికొచ్చిన మక్కలు దెబ్బతినడంతో రైతుల మనోవేదన

ఇల్లెందు/ఇల్లెందురూరల్‌: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మండలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. వర్షాభావ పరిస్థితిలో సాగు చేసిన పంట ఆశాజనకంగా దిగుబడినివ్వలేదు. అరకొరగా చేతికొచ్చిన మక్కలను విక్రయించేందుకు తేమశాతం కోసం రైతులు రహదారులపై ఆరబోశారు. మురసు తీపాన్‌ ప్రభావంతో రెండు రోజులపాటు వర్షం రావడంతో మక్కలు నాని మొలకెత్తాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పట్టాలు కప్పినా ఫలితం లేకుండాపోయింది. తడిసి రంగు మారినట్లుగా ఉన్న మక్కలకు వ్యాపారులు ధర తగ్గిస్తారని రైతులు వాపోతున్నారు. మండలంలోని రొంపేడు నుంచి మర్రిగూడెం గ్రామం వరకు రహదారులపై ఆరబోసిన మక్కలకు మొత్తం మొలకలే వచ్చాయి. వ్యవసాయశాఖ అధికారులు పరి శీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాజ కీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఇల్లెందు నుంచి గుండాల వరకు మొక్కజొన్నలే..

ఇల్లెందు నుంచి గుండాల వరకు ప్రధాన రహదారి వెంట ఎక్కడ చూసినా మొక్కజొన్న పంటను ఆరబోసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టాలు కప్పి, రైతులు పంట వద్దనే నిద్రిస్తున్నారు. మక్కలను రోడ్డుపై ఆరబెట్టడంతో రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చినప్పుడు రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసారి మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,461 కనీస మద్దతు ధర ఉండగా, బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల వరకు పలుకుతోంది. ఇల్లెందు, గుండాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినట్లు అంచనా. చేతికొచ్చిన పంటను ఆరబోసుకునేందుకు సరైన స్థలాలు లేకపోవడంతో బీటీ రోడ్లనే కల్లాలుగా మార్చుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం పంటల ఆరబోతకు సిమెంట్‌ కల్లాలను మంజూరు చేసింది. సిమెంట్‌ కల్లాలు లేని రైతులు పంటను రహదారులపైకి తీసుకొచ్చి రోడ్డులో కొంత భాగాన్ని ఆక్రమించి ఆరబోస్తున్నారు. పిల్లాపాపలతో రేయింబవళ్లు పంట వద్దే ఉంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement