● భార్యను హత్య చేసిన ఏఆర్ కానిస్టేబుల్ ● ఆపై మృతదేహాన్ని గోదావరి నదిలో వేసిన నిందితుడు ● బూర్గంపాడు సమీపంలో మృతదేహం లభ్యం ● మృతురాలు ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి
కొత్తగూడెం అర్బన్/బూర్గంపాడు: ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడిగా మారాడు. అనుమా నం పెనుభూతంగా మారడంతో పోలీసు శాఖలో కాని స్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి భార్య ను హత్య చేసి ఆనవాళ్లు దొరకకుండా సంచిలో మూట గట్టి గోదావరిలో విసిరేసిన ఘటన ఇది. కొత్తగూడెం త్రీటౌన్, బూర్గంపాడు పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఇన్‌స్టాలో పరిచయం
టేకులపల్లి మండలానికి చెందిన నరేందర్ కొత్తగూడెంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నా డు. ఆయనకు ఇన్‌స్ట్రాగామ్‌లో రెండేళ్ల క్రితం ములు గు జిల్లా ఏటూరునాగారానికి చెందిన భవాని (30) తో పరిచయం ఏర్పడగా, ప్రేమించుకున్నారు. వేర్వే రు కులాలు కావడంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో ఆలయంలో ప్రేమవివా హం చేసుకున్నాక కొత్తగూడెం ప్రగతినగర్‌లో కాపు రం పెట్టారు. భవానికి తొలి సంతానంగా జన్మించిన శిశువు కొద్దిరోజులకే అనారోగ్యంతో మృతి చెందింది. ఆ తర్వాత మళ్లీ రెండోసారి గర్భం దాల్చగా ప్రస్తుతం నాలుగు నెలలు నిండాయి. అయితే, ఆమెకు గతంలో ఇతరులతో పరిచయం ఉందంటూ నరేందర్ అనుమానం పెంచుకోగా, ఇటీవల ఇన్‌స్టాలో ఇంకొందరితో చాటింగ్ చేస్తోందని గొడవ పడినట్లు తెలిసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ విబేధాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 3న రాత్రి ఘర్షణ పడడంతో ఇంట్లోనే ఆమెను హత్య చేసిన నరేందర్ తన స్వగ్రామమైన వెళ్లిపోయాడు. అక్కడ తన కుటుంబీకుల విషయాన్ని చెప్పి ఒకరిని తీసుకుని కొత్తగూడెం వచ్చి భవాని మృతదేహాన్ని మూటగట్టి 4వ తేదీన రాత్రి వాహనంలో తీసుకెళ్లి భద్రాచలం బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో విసిరివేశాడు. అప్పటికే భవాని కుటుంబ సభ్యులు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారిస్తున్నారు. ఇంతలోనే నరేందర్ శుక్రవారం పోలీసులకు లొంగిపోగా హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది.
బూర్గంపాడు సమీపాన మృతదేహం
భవానిని నరేందర్ హత్య చేసినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోవడంతో గాలింపు మొదలు పెట్టారు. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు పోలీసులు శుక్రవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్లలో నదిలో గాలింపు చేపట్టారు. నీటిలో నానడంతో కదిలించలేని స్థితిలో చీకటిపడిన సమయాన మృతదేహాన్ని బూర్గంపాడు సమీపంలో గుర్తించా రు. ఆ తర్వాత భద్రాచలం ఏరియా ఆస్పత్రి మా ర్చురీకి తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినా రాయణ, పలు స్టేషన్ల సీఐలు ఇంద్రసేనారెడ్డి, యాసిన్, జితేందర్ గాలింపును పర్యవేక్షించారు. కాగా, మృతదేహం తరలింపులో నరేందర్‌కు ఎవ రు సహకరించారు, అందులో కుటుంబీకులే ఉన్నారా, భార్యను ఆయన ఎలా హత్య చేశాడన్న తదితర వివరాలు తెలియాల్సి ఉంది.


