రుద్రంపూర్: యువత మత్తు, మాదక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంచి నడవడికను అలవర్చుకోవాలని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం క్లబ్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆద్వర్యంలో జిల్లా స్థాయి యువ కళాకారుల ఎంపికలు జరిగాయి. పోటీల్లో 550 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకనందా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో కూడా విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. జానపద నృత్యాలు, జానపద గేయాలు, వీధి నాట కం, వ్యక్తిగత విభాగాల్లో పెయింటింగ్, కవిత్వం, తదితర అంశాల్లో పోటీలు నిర్వహించగా, విజేతలకు డీవైఎస్‌ఓ బి.అనుష సర్టిఫికెట్లు, షీల్డ్‌లు అందించారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన కళాకారులు రాష్ట్రస్థాయి ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుమలరావు, పులి లక్ష్మయ్య, న్యాయనిర్ణేతలు బాలు, రాజేష్, హుస్సేన్ షేక్, మూస, కోచ్‌లు అబ్దుల్ నభీ, కళ్యాణ్, మల్లికార్జున్, నాగేందర్, డేవియల్, రాంబాబు పాల్గొన్నారు.


