చిన్నారులపై పెద్దల పర్యవేక్షణ ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారులపై పెద్దల పర్యవేక్షణ ఉండాలి

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

చిన్నారులపై పెద్దల పర్యవేక్షణ ఉండాలి ●

పెద్దల పర్యవేక్షణలోనే చిన్నపిల్లలు టపాసులు కాల్చాలి. పేలని టపాసులను చేతులతో తీయడానికి పిల్లలను అనుమతించవద్దు. బాణాసంచాలో రసాయనలు ఉండటంతో, అవి కాల్చినప్పుడు వెలువడే పొగ పీల్చితే దీర్ఘకాలిక, స్వల్పకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పొగలో ఉండే సల్ఫర్‌ డయాకై ్సడ్‌, నైట్రోజన్‌ డయాకై ్సడ్‌, పిల్లల శ్వాసనాళాల్లో చేరి ఆస్తమా, బ్రాంకై టిస్‌ వంటి సమస్యలను పెరుగుతాయి. పిల్లల ఊపిరితిత్తులు పూర్తిగా వృద్ధి చెందవు. ఎడతెరిపిలేని దగ్గు, గొంతు మంట, కళ్ల మంటలు, పిల్లికూతలు వచ్చే అవకాశం ఉంది. మతాబుల్లో వినియోగించే బేరియం, అల్యూమినియం, పొటాషియం వంటి రసాయనాలు పిల్లల సున్నితమైన చర్మానికి తగిలినప్పుడు దురద, ఎర్రటి పొక్కులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పిల్లల చెవిలో కర్ణభేరి చాలా సున్నితంగా ఉంటుంది. పెద్ద శబ్దాలు చేసే లక్ష్మీబాంబులు వంటివి పేల్చినప్పుడు వినికిడి శక్తి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అకస్మాత్తుగా వచ్చే శబ్దాలతో చిన్న పిల్లలు తీవ్రమైన భయాందోళనకు గురవుతారు. గుండె వేగం పెరగడం, రాత్రి వేళల్లో నిద్రలో ఉలిక్కిపడిలేవడం వంటి జరుగుతాయి.

–డాక్టర్‌ ముక్కంటేశ్వరరావు, పిల్లల వైద్యనిపుణుడు, పాల్వంచ ప్రభుత్వాస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement