● బాణాసంచా దుకాణాల వద్ద నిబంధనలు తప్పనిసరి ● ఇళ్ల వద్ద టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తత కీలకం | - | Sakshi
Sakshi News home page

● బాణాసంచా దుకాణాల వద్ద నిబంధనలు తప్పనిసరి ● ఇళ్ల వద్ద టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తత కీలకం

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

● బాణాసంచా దుకాణాల వద్ద నిబంధనలు తప్పనిసరి ● ఇళ్ల వద్ద టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తత కీలకం

గర్భిణులు టపాసులకు

దూరంగా ఉండటమే మేలు

దీపావళి పండగ వేళ మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. గృహిణులు, గర్భిణులు బాణాసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పూజల సమయంలో మహిళలు పట్టు చీరలు, నైలాన్‌ జార్జెట్‌, సింథటిక్‌ దుస్తులు ధరిస్తుంటారు. వీటికి నిప్పురవ్వలు తగిలితే చాలా వేగంగా మంటలు అంటుకుంటాయి. టపాసులు కాల్చేటప్పుడు కచ్చితంగా కాటన్‌ దుస్తులు మాత్రమే ధరించాలి. బాణాసంచా పేలుస్తున్న సమయంలో చీరకొంగులను నడుముకు చుట్టుకోవాలి. గాలిలో కొట్టుకునే కొంగుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శానిటైజర్లలో ఆల్కహాల్‌ ఉంటుంది. టపాసులు కాల్చేముందు, దీపాలు పెట్టే ముందు చేతులకు శానిటైజర్‌ రాసుకోవద్దు. టపాసుల పొగలో ఉండే సీసం, కాడ్మియం వంటి భారీ లోహాలు గర్భిణుల శ్వాస ద్వారా కడుపులోని బిడ్డపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. గర్భిణులు టపాసులు కాల్చేటప్పుడు దూరంగా ఉండటమే సురక్షితం. బాణాసంచా పొగ వల్ల చర్మ సంబంధ వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. ప్రమాదవశాత్తు చిన్నపాటి నిప్పురవ్వలు పడి కాలితే ఆ ప్రదేశంలో 15 నుంచి 20 నిమిషాలపాటు సాధారణ చల్లటి నీరుపోయాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి.

–డాక్టర్‌ క్రాంతి మోహార,

జగన్నాథపురం పీహెచ్‌సీ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement