నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించాలి

Nov 7 2026 12:42 AM | Updated on Nov 7 2026 12:42 AM

నిబంధనలు పాటించాలి ●

టపాసుల దుకాణదారులు ప్రమాదాలకు తావులేకుండా నిబంధనలు పాటించాలి. ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. బాణాసంచా విక్రయాలకు అనుమతులు పొందాలి. ప్రతీ దుకాణంలో అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీళ్ల డ్రమ్ములు, బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పరిసరాల్లో ధూమపానం, అగ్గిపుల్లలు వెలిగించడం నిషేధం. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా వైరింగ్‌ విద్యుత్‌ పరికరాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పోలీస్‌, అగ్నిమాపక, అత్యవసర నంబర్లు అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.

–సతీష్‌కుమార్‌, డీఎస్పీ, పాల్వంచ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement