కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నూతన కమిటీ | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నూతన కమిటీ

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఇల్లందు: టీయూసీఐ అనుబంధ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. ఇల్లెందులో జరిగిన రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశంలో 17 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం బాధ్యుడు కే.సూర్యం తెలిపారు. ఈ మేర కు శనివారం వివరాలు వెల్లడించారు. అధ్యక్షుడిగా ఆర్‌. మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా పాయం వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా షేక్‌ యాకుబ్‌ షావలి, సహాయ కార్యదర్శిగా ఎం. చంద్రశేఖర్‌, కోశాధికారిగా సీవై పుల్లయ్య, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా కొత్తపల్లి రఘు, ప్రచార కార్యదర్శిగా జెల్లా అశోక్‌ ఎన్నికయ్యారు.

నిరుద్యోగ గిరిజన

యువతకు ఉచిత శిక్షణ

భద్రాచలం: ఉమ్మడి జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వన్నుట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. భద్రాచలంలోని వైటీసీలో శిక్షన ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం 93474 66615, 94413 90232 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.

పోస్టుల భర్తీకి దరఖాస్తులు

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మణుగూరు రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ లెక్చరర్‌ పోస్టు, టేకులపల్లి ఏకలవ్య మో డళ్ల స్కూల్‌లో స్టూడెంట్‌ కౌన్సిలర్‌ పోస్టును తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయన్నుట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. ఆసక్తి, అర్హతలు కలిగిన ఉమ్మడి జిల్లాలోని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. నవంబర్‌ 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

వర్షానికి తడిసిన మక్కలు

ఇల్లెందురూరల్‌: తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు రైతులు కలవరానికి గురిచేస్తున్నాయి. పండిన మొక్కజొన్నలను రైతులు కల్లాల్లో మక్కలను ఆరబెట్టుకున్నారు. శుక్రవారం రాత్రి, శనివారం కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దగా మారాయి. ఇక చేలల్లో కోతకు సిద్ధంగా ఉన్న పత్తి తడిసి రంగు మారే పరిస్థితికి చేరుకుంది. మిర్చి భారీ వర్షం వల్ల వచ్చిన వరదతో కొట్టుకుపోయింది. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని పలు రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కరువు ప్రాంతంగా ప్రకటించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం జాతీయ కార్యదర్శి కెచర్ల రంగారెడ్డి, ఇల్లెందు మాజీ ఎమ్మె ల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌ అనుబంధ అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఉపాధి హామీ పథకంలో 200 పని దినాలు కల్పించాలని, రోజు కూలి రూ.800 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ అంకిత్‌కు వినతపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముద్దా బిక్షం, నాయి ని రాజు, అమరలపూడి రాము, బుర్ర వెంకన్న, నూప భాస్కర్‌, బానోతు ధర్మ పాల్గొన్నారు.

హెచ్‌–82 జెన్‌కో

కమిటీ ఎన్నిక

పాల్వంచ: తెలంగాణ విద్యుత్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ (హెచ్‌–82) జెన్‌కో రాష్ట్ర కమిటీని శనివారం పాల్వంచలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. జెన్‌కో అధ్యక్షుడిగా ఆవుల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంపటి అనిల్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేసరి రవీందర్‌ శర్మ, ఉపాధ్యక్షుడిగా మహేశ్వరం శ్రీనివాసులు, కోశాధికారిగా పోల్కంపల్లి సాంబశివరావుతోపాటు మరికొందరిని ఎంపిక చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌ పాషా, ప్రధాన కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.

తైక్వాండోలో స్వర్ణపతకం..

పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్‌ సీ కాలనీకి చెందిన సుతీర్థ యాదవ్‌ తైక్వాండో క్రీడలో రాష్ట్ర స్థాయిలో స్వర్ణపతకం కై వసం చేసుకుంది. గత 29 నెల తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరా బాద్‌లోని ఉప్పల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అండర్‌–19 బాలికల ప్రతిభ చూపింది. త్వరలో జార్ఖండ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆమెను కోచ్‌ గణేష్‌ యాదవ్‌, తల్లిదండ్రులు రవికుమార్‌, కల్ప న హర్షం వ్యక్తం చేశారు.

పశువులు స్వాధీనం

వాజేడు: రెండు వాహనాల్లో తరలిస్తున్న పశువులను వాజేడు పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఎస్సై జక్కుల సతీష్‌ కథనం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం మండపాక వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రెండు వాహనాల్లో 15 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులు, భద్రాద్రి జిల్లా టేకులపల్లికి చెందిన భూక్యా వెంకటేష్‌, తేజావత్‌ ప్రసాద్‌, ఆంగోత్‌ పవన్‌, ఆంగోత్‌ అఖిల్‌, జాటోతు లక్ష్మణ్‌లను అరెస్ట్‌ చేశారు. పశువులను భూపాలపల్లిలోని గోశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement