కొత్తగూడెంఅర్బన్: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో శనివారం జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి బి.అనూష, కళాశాల ప్రిన్సిపాల్ జగన్ మోహన్ రాజు, ఎస్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కామేశ్వర్రావు, జిల్లా మేరా యువ భారత్ అధికారి ఎం.వెంకట్ రాంబాబు హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. యువతలో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, దేశాభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే లక్ష్యంతో యూత్ పార్లమెంట్ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వన్ నేషన్–వన్ ఎలక్షన్ అనే అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలు బి.నవదీప్రెడ్డి, జి.మేఘన, జి.పావనిలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.


