ఐక్యతతోనే అభివృద్ధి పథం | - | Sakshi
Sakshi News home page

ఐక్యతతోనే అభివృద్ధి పథం

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఐక్యతతోనే అభివృద్ధి పథం పురుగుల మందు తాగి ఆత్మహత్య

కొత్తగూడెంఅర్బన్‌: ఐక్యంగాఉంటే అభివృద్ధి సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు అన్నారు. భారతరత్న, సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకమత్యంతో, జాతి మత విభేదాలు లేకుండా ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జీఎంలు మురళీధర్‌రావు, జీవీ కిరణ్‌కుమార్‌, కార్మి క నాయకులు రమణమూర్తి, ఆర్‌.సంజీత్‌, హరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

అశ్వారావుపేట: భార్య మందలించిందని పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జరిగింది. దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామానికి చెందిన చింతల హరీష్‌ (32) మద్యానికి బానిస కావడంతో భార్య దుర్గ మందలించింది. దీంతో అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలోని తన సోదరి నారం ముత్తమ్మ ఇంటికి వెళ్లాడు. ముత్తమ్మ సాయంత్రం ఇంటికి చేరుకునే సరికి సోదరుడు హరీష్‌ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడు చింతల రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికిషోర్‌ రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement