పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

● మరో నెలలో వివాహం.. ● రైలు నుంచి దూకి బలవన్మరణం

● మరో నెలలో వివాహం.. ● రైలు నుంచి దూకి బలవన్మరణం

రఘునాథపల్లి: ఇష్టం లేని పెళ్లి సంబంధంతో మనస్తాపానికి గురైన యువతి రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. జీఆర్‌పీ పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన కుంటి బాబూరావు కుటుంబం 20 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌ కాలనీలో స్థిరపడింది. బాబూరావు ఎలక్ట్రీషియన్‌గా కుటుంబాన్ని పోషి స్తుండగా, ఆయన కుమార్తె శ్రావణి (24) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు కొంతకాలం క్రితం మేనబావతో వివాహం నిశ్చయించగా, శుక్రవారం రాత్రి పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఒకటి, రెండుసార్లు కుటుంబ సభ్యులతో ఫో్‌న్‌లో మాట్లాడిన ఆమె, శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో రఘునాథపల్లి శివారులో రైలులో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

టికెట్‌ ఆధారంగా గాలింపు..

శ్రావణి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె రిజర్వేషన్‌ టికెట్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న మేనబావకు పంపించారు. ఆయన జనగామ రైల్వేస్టేషన్‌కు చేరుకుని పరిశీలించగా, రైలు బోగీలో ఆమె బ్యాగ్‌ లభించింది. కాగా జీఆర్‌పీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రఘునాథపల్లి సమీపంలో పట్టాల పక్కన మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మేనబావతో వివాహం ఇష్టం లేకపోవడం, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలు స్తోంది. ఈ నెల 29న వివాహం జరగాల్సి ఉన్న క్రమంలో ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. పెళ్లి సందడి ఉండాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement