సామాజిక అవగాహన పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

సామాజిక అవగాహన పెంపొందించాలి

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

కొత్తగూడెంఅర్బన్‌: విద్యార్థుల్లో సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించాలని ఇన్‌చార్జి డీఈ ఓ ఎస్‌. మాధవరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఆనందఖని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి రోల్‌ప్లే పోటీల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో సామాజిక స్పృహ, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థుల బృందాలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఆరోగ్యకరమైన ఎదుగుదల, మానసిక ఆరోగ్యం, లింగ సమానత్వం, పోషకాహారం, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, పునరుత్పత్తి ఆరోగ్యం, హెచ్‌ఐవీ నివారణ, ఇంటర్నెట్‌–గాడ్జెట్ల సురక్షిత వినియోగం వంటి 11 రకాల సామాజిక అంశాలపై అద్భుతమైన నటన ద్వారా సమాజానికి చక్కని సందేశాలను ఇస్తూ ఆకట్టుకున్నారు. విజేతలకు మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి బి.సంపత్‌ కుమార్‌, ఏఎంఓ టి. మాధవరావు, నీరజ అన్నపరెడ్డి, ఆనంద్‌, పరమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement