భూ సేకరణ అక్రమాలపై విచారణ | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ అక్రమాలపై విచారణ

Oct 31 2026 12:25 AM | Updated on Oct 31 2026 12:25 AM

మణుగూరు టౌన్‌: సింగరేణి మణుగూరు ఓసీ విస్తరణ భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. దళారులతో కలిసి రెవెన్యూ అధికారులు వందలాది మంది అనర్హుల పేర్లు జాబితాలో చేర్చి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. దీంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. శుక్రవారం అదనపు కలెక్టర్‌ మణుగూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం గతంలో సీజ్‌ చేసిన శివలింగాపురం రైస్‌మిల్‌, బకాయిల వసూళ్లపై సమీక్షించి మిల్లు ఆస్తులను స్వాధీనం చేసుకునే అంశాలపై చర్చించారు. అదనపు కలెక్టర్‌ను వివరణ కోరగా.. భూ సేకరణలో ఆరోపణలపై విచారణ చేపట్టామని, అధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. సర్వే, జాబితా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అద్దంకి నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement