దుమ్ముగూడెం : మండలంలోని పెదపాడు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు మల్లా మోహన్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవంలో బెస్ట్ ఆల్‌రౌండర్ ఫెర్మార్మర్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం – ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ షార్ట్ ఫిల్మ్ సెలక్షన్స్ శుక్రవారం ముగిశాయి. జాతీయస్థాయికి రాష్ట్ర జట్టును ఎంపిక చేసేందుకు ఈ పోటీలు నిర్వహించారు. నాలుగు విభాగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మోహన కుమార్ ఆల్‌రౌండర్‌గా నిలిచారు. ఆయనకు నిర్వాహకులు యామిని కనకధార, శ్రీశైలం సర్టిఫికెట్ అందించి అభినందించారు.


