అశ్వాపురం: మండలంలో ఇటీవల జరిగిన బైక్ చోరీల ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన గొడుగు వెంకన్న స్కూటీ ఇంటి ఎదుట బైక్‌ను నిలపగా దొంగలు చోరీ చేశారు. అశ్వాపురానికి చెందిన పాషా అనే వ్యక్తి బైక్ కూడా అపహరించారు. ఈ ఘటనలపై ఫిర్యాదు చేశామని, అయినా పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బైక్ దొంగలను గుర్తించాలని కోరుతున్నారు.
వృద్ధుడి అదృశ్యం
భద్రాచలంఅర్బన్: వృద్ధుడి అదృశ్యంపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కరీముల్లా ఖాన్‌్ (56) ఈ నెల 16న పాత మార్కెట్ ప్రాంతంలోని దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


