రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ విజేత ఖమ్మం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీ విజేత ఖమ్మం

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

గద్వాల న్యూటౌన్‌: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యాన నిర్వహించిన 70వ రాష్ట్రస్థాయి బాలుర అండర్‌–17 క్రికెట్‌ టోర్నీ విజేతగా ఖమ్మం జట్టు నిలిచింది. గురువారం సాయంత్రం రంగారెడ్డితో జరిగిన ఫైనల్స్‌లో ఖమ్మం క్రీడాకారులు సమష్టిగా రాణించి 62 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఫైనల్‌లో పరుగుల వరద

ఖమ్మం – రంగారెడ్డి జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 15 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రసన్న 81, చైతన్య 21 పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆతర్వాత బ్యాటింగ్‌ చేసిన రంగారెడ్డి ఆరు వికెట్లు కోల్పోయి 115 పరుగులకే పరిమితం కావడంతో ఓటమి పాలైంది. తొలుత సాగిన రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు కూడా ఉత్కంఠభరితంగా సాగాయి. మొదటి సెమీస్‌లో మహబూబ్‌నగర్‌ – రంగారెడ్టి జట్ల మధ్య జరగగా.. 3 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయాన్ని సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీస్‌లో ఖమ్మం – మెదక్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఖమ్మం 52 పరుగుల తేడాతో మెదక్‌ను చిత్తుచేసింది. కాగా, విజేత ఖమ్మం జట్టుకు జోగుళాంబ గద్వాల డీఈఓ విజయలక్ష్మి ట్రోఫీ అందజేసి అభినందించారు. ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శ్రీనివాసులు, పరిశీలకుడు డేవిడ్‌సన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌జీఎఫ్‌ టోర్నీలో రంగారెడ్డిపై ఘనవిజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement