ఇల్లెందు: ఇల్లెందు ఏరియాలో వైసీఓఏ క్లబ్లో నిర్వహిస్తున్న సింగరేణి కంపెనీస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. ఏరియా జీఎం వీసం కృష్ణయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ధృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కాగా పోటీల్లో ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియాల జట్టు విజేతగా, భూపాలపల్లి, ఆర్జీ–3 ఏరియాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడా ప్రతినిధులు అజ్మీర తుకారాం, బి. నాగేశ్వరరావు, సుందర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అశోక్, పోస్నెట్, నరేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రమేష్, శ్రావణ్, జాకబ్, కాంతారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


