ఓటు పరిరక్షణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఓటు పరిరక్షణే లక్ష్యం

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

ఇల్లెందు: అర్హుల ఓట్ల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ ఎ. శ్రీదేవసేన తెలిపారు. బుధవారం ఇల్లెందు మున్సిపల్‌ సమావేశ మందిరంలో జరిగిన ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై కలెక్టర్‌ అంకిత్‌తో కలిసి ఈఆర్‌ఓలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వీకరించిన ఫారం–6, 6ఏ, 7, 8 దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి, ఈఆర్‌ఓలు తనిఖీ చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులతో డోర్‌ టు డోర్‌ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లో అత్యధిక చేర్పులు, అత్యధిక తొలగింపులు చేసిన 20 పోలింగ్‌ కేంద్రాలను పునఃపరిశీలించాలని ఆదేశించారు. నోటీస్‌లు జారీ, హియరింగ్‌ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలన్నారు. సరిహద్దు జిల్లాల వద్ద ద్వంద్వ నమోదులను తనిఖీ చేయాలని చెప్పారు. ఎపిక్‌ కార్డుల పంపిణీపై దృష్టి పెట్టాలని, ప్రింట్‌ అయిన కార్డులు సంబంధిత ఓటర్లకు చేరేలా చూడాలన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎపిక్‌ కవరేజీ 99.99 శాతం పూర్తయిందని తెలిపారు. 18–19 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు 5,608 మంది, ఎన్నారై ఓటర్లు 28 మంది ఉన్నట్లు తెలిపారు. ఫారం–6లో 13,119 దరఖాస్తులు, ఫారం–6ఏలో 34 దరఖాస్తులు, ఫారం–7లో 800 దరఖాస్తులు, ఫారం–8లో 27,033 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. వాటి పరిష్కారం కోసం చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీఓ రాహుల్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీ మధు, ఈఆర్‌ఓ లు, ఏఈఆర్‌ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ శ్రీదేవసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement