● ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి వీసీని నియమించండి.. ● విద్యాశాఖ ముఖ్యకార్యదర్శితో మంత్రి తుమ్మల భేటీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మంనియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణాతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లోని 16 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో నూతన భవనాల నిర్మాణం, మరమ్మతులు, వసతుల కల్పనకు రూ.10.12 కోట్లు మంజూరు చేయాలని తెలిపారు.
రెగ్యులర్ వీసీ.. సమస్యల పరిష్కారం
కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి త్వరగా రెగ్యులర్ వీసీని మంత్రి తుమ్మల సూచించారు. యూనివర్సిటీ పరిపాలనను బలోపేతం చేయడంతోపాటు, మౌలిక వసతులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. విశ్వవిద్యాలయ ఉద్యోగులు అందిన వినతిపత్రాన్ని అందజేసిన మంత్రి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.


