భద్రాచలంఅర్బన్: వందల మందిని ఇంటర్వ్యూ లకు పిలుస్తున్న క్రమాన అభ్యర్థులకు కనీస ఏర్పాట్లు చేయాలనే బాధ్యతను అధికారులు విస్మరిస్తున్నారు. ఇటీవల కొత్తగూడెంలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో కనీస సౌకర్యాలు లేక అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై విమర్శలు వచ్చినా భద్రాచలం మండల పరిషత్ కార్యాలయంలో చర్ల, దుమ్ముగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధి ఆయా పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులు తీరు మార్చుకోవడం లేదు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు, వారి బంధువులు రాగా, తాగునీటి మాటేమో కానీ టెంట్లు, కుర్చీలు ఏర్పాటుచేయకపోవడం గమనార్హం. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, దుమ్ముగూడెం, చర్ల సీడీపీఓలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నప్పటికీ సౌకర్యాలు కల్పించకపోవడంపై లేమిపై విమర్శలు వచ్చాయి.
అంగన్‌వాడీ ఇంటర్వ్యూలకు
అరకొరగానే ఏర్పాట్లు


