ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

కొత్తగూడెంఅర్బన్‌: పాతకొత్తగూడెంలోని జిల్లా శిక్షణ కేంద్రంలో ఉపాధ్యాయులకు ఇస్తున్న మూడు రోజుల ‘కౌశల్‌ బోధ్‌‘ శిక్షణ బుధవారం ముగిసింది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి, ప్రయోగాత్మక బోధనను పెంపొందించే ఉద్దేశంతో ఈ శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు ముగింపు సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శంభుప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో పుస్తక జ్ఞానమే కాక సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, చేతివృత్తులపై అవగాహన కల్పించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యాశాఖ అధికారులు టి.మాధవరావు, బి.సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలు ధైర్యంగా రాయాలి

భద్రాచలంఅర్బన్‌: పరీక్షలపై భయం విడనాడి ఆత్మవిశ్వాసంతో రాసి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ శంభుప్రసాద్‌ పదో తరగతి విద్యార్థులకు సూచించారు. భద్రాచలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడి సామర్థ్యాలను పరీక్షించారు. ఎస్‌ఏ–1 పరీక్షలపై సన్నద్ధతపై ఆరా తీసిన డీఈఓ పలు సూచనలు చేశారు. ఆతర్వాత విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం అమలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం పీ.ఎస్‌.వీ. ప్రసాద్‌బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement