టార్గెట్‌ కొడతారు! | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ కొడతారు!

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

మన వాళ్లు ప్రత్యేకం

ఆర్చరీ క్రీడలో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన తానిపర్తి చికిత తాజాగా ఏషియన్‌ గేమ్స్‌లో రెండు పతకాలు ఖాయం చేసుకుంది. ఈక్రమాన జిల్లా క్రీడాకారులు సైతం ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. వీరు కూడా కామన్‌వెల్త్‌, ఏషియన్‌ గేమ్స్‌, ఒలింపిక్‌ స్థాయికి ఎదిగేలా ప్రతిభకు మరింత సాన పెట్టడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఆర్చరీలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. ఖేలో ఇండియా సెంటర్లలో పరిశీలిస్తే ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల క్రీడాకారుల కంటే ముందు నిలుస్తున్నారు. ప్రధానంగా కోయ తెగ విద్యార్థులు సహజ సిద్ధమైన ప్రతిభకు తోడు శిక్షణతో రాటుదేలుతున్నారని

పాల్వంచ ఆర్చరీ సెంటర్‌ కోచ్‌ కళ్యాణ్‌

వెల్లడించారు. ఈయన ములకపల్లి వాసి కాగా, చిన్నతనంలో కుటుంబ సభ్యులతో కలిసి బాణాలు వేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కిన్నెరసాని కాలేజీలో ఆర్చరీలో రాటుదేలి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించాక కోచ్‌గా పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement