ఏటీఎంలకు ‘ఫుల్‌’ క్యాష్‌! | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలకు ‘ఫుల్‌’ క్యాష్‌!

Sep 28 2026 12:35 AM | Updated on Sep 28 2026 12:35 AM

● నగదు కొరత రాకుండా ముందస్తు చర్యలు ● నేటి నుంచి మూతపడనున్న బ్యాంకులు

● నగదు కొరత రాకుండా ముందస్తు చర్యలు ● నేటి నుంచి మూతపడనున్న బ్యాంకులు

చుంచుపల్లి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె సోమవారం మొదలుకానుంది. మూడు రోజుల పాటు సమ్మె కొనసాగనున్నందున నగదు ఇక్కట్లు రాకుండా జిల్లాలోని ఏటీఎంల్లో ముందస్తుగా ఆదివారం నగదు నింపారు. ఈమేరకు బ్యాంకర్లు, క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల సిబ్బంది నగదు సేకరణ, ఏటీఎంల్లో నింపడంలో నిమగ్నమయ్యారు. కాగా, మూడు రోజుల సమ్మె కారణంగా ఆదివారం బ్యాంకులకు పనిదినంగా ప్రకటించడంతో పలువురు తమ పనులు పూర్తిచేసుకున్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపుతో ఐదు రోజుల పనిదినాల విధానం అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సమ్మెకు దిగారు. కాగా, బ్యాంకు శాఖలు మూసివున్నా ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, నగదు బదిలీకి సంబంధించిన డిజిటల్‌ సేవలు కొనసాగుతాయి. కాగా, ప్రైవేట్‌ బ్యాంకుల కార్యకలాపాలపై సమ్మె ప్రభావం తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.

బ్యాంకుల్లో బారులుదీరిన ఖాతాదారులు

చర్ల: వరుసగా మూడు రోజులు ఉద్యోగుల సమ్మె నేపథ్యాన ఆదివారం బ్యాంకులకు పనిదినంగా ప్రకటించారు. ఈమేరకు చర్ల మండలంలోని ఆర్‌ కొత్తగూడెం, సత్యనారాయణపురం, చర్లలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులు, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలతో పాటు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, డీసీసీబీ బ్రాంచ్‌ల్లో లావాదేవీలు కొనసాగాయి. ఖాతాదారులకు బ్యాంకుల నుంచి సమ్మె విషయం, ఆదివారం పనిదినంగా ఉంటుందని ముందస్తుగా మెసేజ్‌లు రావడంతో లావాదేవీలు కొనసాగించేందుకు బారులు దీరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement