ప్రారంభమైన ‘ఏకలవ్య’ క్రీడా పోటీలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ‘ఏకలవ్య’ క్రీడా పోటీలు

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

● ఎనిమిది స్కూళ్ల నుంచి హాజరైన 320 మంది క్రీడాకారులు ● పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కనకయ్య

● ఎనిమిది స్కూళ్ల నుంచి హాజరైన 320 మంది క్రీడాకారులు ● పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కనకయ్య

టేకులపల్లి: టేకులపల్లి మండలంలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో భద్రాద్రి క్లస్టర్‌ స్థాయి క్రీడాపోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి చదువుతో పాటు క్రీడలు అవసరమని పేర్కొన్నారు. క్రీడాపోటీల్లో పాల్గొనడం ద్వారా గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వం అలవడుతుందని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత దక్కుతుందని చెప్పారు. ఈమేరకు ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టేకులపల్లితో పాటు గుండుగలపల్లి, ములకలపల్లి, చర్ల, పాల్వంచ, గుండాల, సింగరేణి, దుమ్ముగూడెం ఏకలవ్య పాఠశాలలకు చెందిన 320 మంది క్రీడాకారులు హాజరుకాగా, మూడు రోజుల పాటు వివిధ అంశాల్లో క్రీడా పోటీలు జరగనున్నాయి. శ్రీలక్ష్మి, నోడల్‌ ఆఫీసర్‌ కృష్ణ, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ వీరూనాయక్‌, ప్రిన్సిపాల్‌ నిశాంత్‌ కృష్ణవ, సర్పంచ్‌ నరేష్‌, ఎస్‌ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement