తిరిగి బాధ్యతలు అప్పగించిన సర్కారు
కొత్తగూడెంఅర్బన్: ఎౖక్సైజ్, ప్రొహిబిషన్ జిల్లా సూపరింటెండెంట్‌గా తిరిగి ఏ.శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. గత నెలలో భద్రాచలంలోని ఎకై ్సజ్ స్టేషన్ నుంచి గంజాయి అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఓ నిందితుడు తప్పించుకున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఘటనకు బాధ్యులుగా భద్రాచలం సీఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. అంతేకాక పర్యవేక్షణ లోపం ఉందంటూ జిల్లా ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరెడ్డిని సరెండర్ చేశారు. అయితే, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు శ్రీనివాసరెడ్డి 34 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుని మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచిస్తూ జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు బుధవారం ఆయన కొత్తగూడెంలోని జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
నేడు మద్యం విక్రయాలపై నిషేధం
గణేష్ నిమజ్జనం నేపథ్యాన గురువారం పలు ప్రాంతాల్లో వైన్స్, బార్ షాపుల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం స్టేషన్ల పరిధిలోని వైన్స్, బార్లు గురువారం ఉదయం 6నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు మూసివేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఎకై ్సజ్ చట్టం ప్రకారం కఠినచర్యలు ఉంటాయని వెల్లడించారు. కాగా, మణుగూరు, అశ్వారావుపేటలో మాత్రం విక్రయాలపై నిషేధం ఉండదని తెలిపారు.


