చెవిలో పూలతో ప్రజావాణిలో నిరసన | - | Sakshi
Sakshi News home page

చెవిలో పూలతో ప్రజావాణిలో నిరసన

Sep 22 2026 12:24 AM | Updated on Sep 22 2026 12:24 AM

పాల్వంచరూరల్‌: పాల్వంచ ఎంపీడీఓ కార్యాలయంలో ఓ అర్జీదారుడు తన సమస్యను పరి ష్కారం చేయడంలేదని రెండు చెవ్వుల్లో పూలు పెట్టుకుని వచ్చి ప్రజావాణిలో అర్జీ అందజేశాడు. కిన్నెరసాని గ్రామ పంచాయతీ రాజాపురం గ్రామానికి చెందిన బుడగం సత్యనారాయణ నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. తన పామాయిల్‌ తోటలో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం ప్రజా వాణిలో రెండుసార్లు దరఖాస్తు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదన్నాడు. విద్యుత్‌శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ నుంచి ఎన్‌ఓసీ తేవాలని చెబుతున్నారని, రెన్యూ అధికారులు మాత్రం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా సోమవారం ఎంపీడీఓ ప్రజావాణికి హాజరుకాలేదు. కొందరు హాజరైనా ఒక దరఖాస్తు మాత్రమే వచ్చింది.

అర్జీలను పరిష్కరించాలి

భద్రాచలంటౌన్‌: గిరిజన దర్బార్‌లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆర్సీఓ గురుకులం అరుణకుమారి, ఏడీఎంహెచ్‌ఓ సైదులతో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. 150కుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఉదయ్‌కుమార్‌, పవర్‌ వేణు, సున్నం రాంబాబు, ఆదినారాయణ, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మందుల

దుకాణాల్లో తనిఖీలు

పినపాక: మండలంలోని పలు మందుల దుకాణాలను జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అశ్విని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల విక్రయాలు, రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ.బయ్యారంలో నిబంధనలు ఉల్లంఘించిన మూడు మందుల దుకాణాల నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

‘వయో వృద్ధుల’

పురస్కారాలకు

దరఖాస్తుల ఆహ్వానం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అక్టోబర్‌ 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయో వృద్ధుల సాధికారత కోసం సేవలందిస్తున్నవారికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అర్హత ఉన్న వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈమేరకు డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా సోమవారం ఒక ప్రకటన చేశారు. దరఖాస్తు ఫారం, మార్గదర్శకాల కోసం www. wdsc. telangana. gov. in వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు.

భద్రాచలం ఆస్పత్రి సేవలపై మంత్రి స్పందన

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో కంటి వైద్య సేవలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ఈ నెల 20న ‘వెలుగు నింపుతున్న దవాఖానా’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఉచిత కంటి శస్త్రచికిత్సలు, మెరుగైన వైద్య సేవలను ప్రస్తావించిన కథనంపై మంత్రి స్పందించడంతో వైద్య సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement