విగ్రహాల తరలింపులో
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: భారీ వినాయక విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ నోడల్ అధికారి పి.మధుసూదన్ రావు, ఎస్‌ఈ మహేందర్ సూచించారు. సోమవారం కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లో భారీ వినాయక విగ్రహాల మండపాలను పరిశీలించారు. ఉత్సవ కమిటీలతో మాట్లాడి విగ్రహాల తరలింపులో విద్యుత్ లైన్ల గమనించాలని, విద్యుత్ ప్రమాదాలు రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరా స్థితిగతులు, క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కోంటున్న సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.


